రాజంపేట్ పోలీస్ స్టేషన్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ బుధవారం ఆకస్మీక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని ఎస్ఐని ఆదేశించారు. ఎస్పీ వెంట కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావు, భిక్నూర్ సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ పుష్పరాజ్ వున్నారు.