నాగిరెడ్డిపేట, మాల్తుమ్మెద సొసైటీ పరిధిలోని 12 గ్రామాలలో గల పిపిసి సెంటర్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా అధికారుల సహకారంతో నేటికీ 2 లక్షల వరి ధాన్యం బస్తాలు కొనుగోలు చేయడం బిల్లులు ఆన్లైన్ చేయడం జరిగిందని సొసైటీ చైర్మన్ దుందుగల నరసింహులు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 12 రోజుల్లోనే రెండు లక్షల బస్తాలు కొనుగోలు చేయడం సొసైటీ పరిధిలో మొదటిసారి అన్నారు.