నాగిరెడ్డిపేట మండలం బంజర తండా -లింగంపల్లి రోడ్డులో పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువకు బుంగపడింది. లింగంపల్లి గ్రామస్తులు జేసీబీ తో బుంగ పనులు చేస్తుండగా, పోచారం ప్రధాన కాలువ సైడ్వాల్ పడిపోయింది. దీంతో లింగంపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కొనసాగడంతో రోడ్డు బాగాలేదని లారీలు రావడం లేదని, వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయాలని సోమవారం లింగంపల్లి వాసులు ఎమ్మార్వో శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.