కులగణన సమగ్ర కుటుంబ సర్వేకు గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ అన్నారు. శనివారం 8వ రోజు మండలంలోని వెల్లుట్లపేట్ లో ఎన్యూమరేటర్లు చేస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేను ఆర్డీఓ తనిఖీ చేశారు. ఆర్డీఓ మాట్లాడుతూ కుటుంబాల యజమానులు, గ్రామ ప్రజలు రాష్ట్ర సర్కారు గ్రామీణ ప్రాంతాలలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించాలన్నారు.