ఎల్లారెడ్డి పిపిసి గండిమాసానిపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటి చైర్మన్ ఏగుల నర్సింలు, వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్ కలిసి బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మాత్రమే ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని, క్వింటాల్ కు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,320, B గ్రేడ్ ధాన్యానికి రూ. 2,300 ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని చైర్మన్ కోరారు.