ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం మళ్ళీ భారీ వాన మొదలైంది. 1. 30కిఉరుములు, మెరుపులతో కూడిన వాన మొదలై ఇంకా కొనసాగుతుంది. దీంతో రైతన్నల్లో ఆందోళన మొదలైంది. వరికోత యంత్రాలు పెట్టి పంటకోసి వడ్లకొనుగోలు కేంద్రాలకు తరలిస్తే రైతులను రెండు రోజులుగా వాన వెంటాడుతోంది. ఎంత టార్పాలిన్ లు కప్పిన అడుగున వడ్లు నానిపోతుండగా, పొలాల్లో వరిపంట కింద పడి వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళనతో వున్నారు.