రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములను నిర్మిస్తుందని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం నేరల్ తండాలో 14 లక్షల రూపాయల నిధులతో గాంధారి సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న 150 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ శంఖుస్థాపన చేశారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.