హిందూ దేవి, దేవత విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ ఈనెల 23న ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఎల్లారెడ్డి హిందూ సంఘాలు బంద్ కు మంగళవారం పిలుపునిచ్చాయి. వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, విద్య సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరు బంద్ కు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఇచ్చిన బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని వాల్ పోస్టర్లను సైతం విడుదల చేసారు.