వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనపై ఆదివారం ఎల్లారెడ్డి తహశీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ 15, 000 వేల హామీ ఏమైంది అని టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్ ప్రశ్నించారు. రాస్తారోకోతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.