న్యాయపరమైన సమస్యలపై ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన

79பார்த்தது
న్యాయపరమైన సమస్యలపై ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన సమస్యలపై హైదరాబాదులోని ఇందిరా చౌక్ వద్ద సరైన మార్గంలో శాంతియుత ధర్నా చేశారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాదులో ఇందిరా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఔట్సోర్సింగ్ కార్మికులు నెలల తరబడి వేతనాలు రాక కుటుంబాల పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ప్రభుత్వం వేతనాల చెల్లింపులు జాప్యం చేయడం తగదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி