బిక్కనూర్ మండల కేంద్రంలోని జడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాన్ని సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పాఠశాల గది తలుపులను ధ్వంసం చేసి గదిలోకి చొరబడి, నీటిశుద్ది యంత్రాన్ని, ఆరు నల్లాలను ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. టీచర్ తమ్మల రాజు పాఠశాలకు వెళ్లి పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.