పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత భవిష్యత్తులో అవసరానికి అనువైన విద్యను అభ్యసించాలి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పదవతరగతి విద్యను అభ్యసిస్తున్న తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులు చదువుతున్న పుస్తకాల్లోని వివరాలు అడిగి తెలుసుకున్నారు.