కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్)గ్రామంలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరోక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను అలంకరించి మహిళలు పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మల చుట్టూ 'రామ రామ ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టు ఆడారు. ప్రకృతిని కాపాడే పండుగ బతుకమ్మ పండుగ తమకెంతో ఇష్టమని మహిళలు తెలిపారు. అనంతరం గ్రామంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.