భిక్కనూర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమైన మద్ది చంద్రకాంత్ రెడ్డిని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, అతిమాముల శ్రీధర్ లు గురువారం ఆయన నివాసంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ. జిల్లాలో విద్యాభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.