మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అన్నా బహుశాటే విగ్రహం దగ్గర అంబేద్కర్ కి అన్నా బహుసాటేకి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుండి డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.