బాన్సువాడ మండలంలోని హన్మజిపేట్ గ్రామంలో బోర్లమ్ సొసైటీ పరిధిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంగ్రం నాయక్, నాయకులు నార్ల సురేష్ గుప్తా, పిట్ల శ్రీధర్, గోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు