బాన్సువాడ: కల్కి చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే పోచారం

80பார்த்தது
బాన్సువాడ: కల్కి చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మత్స్య సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி