కామారెడ్డి పట్టణంలోని జిల్లా గ్రంధాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టం 19వ వార్షిక వారోత్సవాలను కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యదర్శి అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా ఎంఏ సలీం పాల్గొని ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత జవాబుదారీతనం ఈ చట్టం ఒక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ సందర్భంగా పాఠకులకు సమాచార హక్కు చట్టం 2005 గురించి అవగాహన కల్పించారు.