ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించడంలో గాని, పారిశుద్ధ్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకొని ఉద్యోగం నుండి తొలగిస్తామని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అయిన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు పాల్గొన్నారు.