కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్ తండా గ్రామానికి చెందిన దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్ కుమారుడు కేతావత్ మహేష్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వెటర్నరీ ఫలితాలలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం తoడవాసులు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ , చందర్ నాయక్, మోహన్ నాయక్, బంజారా అధ్యక్షులు రాము రాథోడ్, పాల్గొన్నారు.