నేను ఎక్కడికి పోయేది లేదు స్థానికుడిని.. పార్టీ ఇన్ ఛార్జ్

75பார்த்தது
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన తాను ఓడిన ప్రజలతోనే ఉన్నానని, తనకు ఇక్కడ తాడ్కోల్ గ్రామంలో ఓటు హక్కు కూడా ఉందని పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను ఇక్కడే ఉండి పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி