బాన్సువాడ మండలంలోని గట్టుమీద గ్రామాలలో హనుమాజీపేట్ కోనాపూర్ సంగంజిపేట్ గ్రామాలలో మంగళవారం అట్లబతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రకృతిలో లభించే పువ్వులతో బతుకమ్మను చేసి బతుకమ్మను గ్రామాల్లోని ప్రధాన వీధులలో ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటు పాటలు పాడుతూ బతుకమ్మను గ్రామ సమీపంలో గల చెరువులో వేశారు. అనంతరం వారితో తీసుకువెళ్లిన అట్లను ఒకరికొకరు పంచుకుంటూ తినేసి తిరుగు ప్రయాణమయ్యారు.