వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కార్యాలయం, రికార్డ్స్, రిసెప్షన్ రూమ్, సిబ్బంది క్వార్టర్, పరిసరాలను తనిఖీ చేశారు. కేసులు నమోదు అవుతున్న తీరు, వివరాలను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, ప్రజలకు నేరలపై అవగాహనా కల్పించాలని ఎస్ఐ కిరణ్ కుమార్ కు సూచించారు. అనంతరం సీఐతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.