మెట్‌పల్లి: హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని అలాగే తెలంగాణలో ఇస్లామిక్ మతోన్మాద శిక్షణ కేంద్రాలను మూసివేయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఇస్లామిక్ మతోన్మాద శక్తులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రంలో వీటి పైన ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని శనివారం అన్నారు.