జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం శివయ్య పూజా సామాగ్రి అమ్మకాల జోరు అంబరాన్నంటింది. మహా శివరాత్రి పూజలో పాలు, నీరు, తేనె, బిల్వపత్రాలు, బెల్పత్ర, భాంగ్, ధాతుర, మదర్ పుష్పం, తెల్ల గంధం, తెల్లని పుష్పాలు, ఆవు పాలు సామాగ్రి ఉపయోగిస్తారు. ఇవే కాకుండా చిలగడదుంప, మొక్కజొన్న కంకులు, గోగు పువ్వు వంటి నైవేద్య సామాగ్రి అమ్మే దుకాణాలు జనం తాకిడితో కిటకిటలాడాయి.