ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని పత్తి జిన్నింగ్ మిల్లులో శుక్రవారం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలోనే ఏకైక పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎండపల్లి మండలం లో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.