ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉద్యోగ విజేతకు సన్మానం

84பார்த்தது
ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉద్యోగ విజేతకు సన్మానం
ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఉడాన్ శివ మహేష్ అనే యువకుడు టీజీ ప్రభుత్వం నిర్వహించిన ఐదు ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపించాడు. గతంలో గురుకుల ఉపాధ్యాయ టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు, గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుకు, టీఎస్పీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్, ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టుకు ఎంపికైనాడు. ఈ సందర్భంగా ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహేష్ ను శనివారం ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி