ఏపీ మాజీ సీఎం జగన్‌పై మంత్రి సత్యకుమార్ కీలక విమర్శలు చేశారు. జైలుకు వెళ్లిన వారిని పరామర్శించడమే జగన్ పని అని మంత్రి ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎలా జరుగుతుందో వచ్చి చూస్తే తెలుస్తుందని, జగన్ కేవలం పరామర్శలకే పరిమితమయ్యారని సత్యకుమార్ పేర్కొన్నారు. తన అనుచరులు దందాచేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల్లో అదే తనకు చివరి రోజని మంత్రి సవాల్ చేశారు.