భారత స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరైనట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో వచ్చిన రూ.60 కోట్ల భరణం వార్తలపై ధనశ్రీ కుటుంబం తాజాగా స్పందించింది. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ నిరాధారాలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అంత మొత్తాన్ని ఎవరు అడగలేదని.. అటువైపు వారు ఇస్తానని చెప్పలేదని తెలిపింది. ప్రతి ఒక్కరి గోప్యత పట్ల గౌరవంగా వ్యవహరించాలని ధనశ్రీ కుటుంబం మీడియాను కోరింది.