AP: విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లకు జనాదరణ కరువుతోంది. ఐపీఎల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడుపోవడం లేదని తెలుస్తోంది. విశాఖ వేదికగా ఈనెల 24న లక్నోతో ఢిల్లీ తలపడనుంది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతో టిక్కెట్లు అమ్ముడుపోలేదని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ విశాఖకు చేరుకోగా.. నాలుగు రోజులు అవుతున్నా సరైన ఆదరణ కనిపించడం లేదని సమాచారం.