అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడోదైన చివరి వన్టేలో భారత మహిళల జట్టు బౌలర్లు చెలరేగుతున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 19 ఓవర్లకు 66 పరుగులు చేసి కీలక 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం హాలిడే 10*, గ్రీన్ 0* క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, సైమా ఠాకోర్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను సొంతం చేసుకుంటుంది.