AP: తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా. నా మంత్రి పదవిని జగన్ తీసేశారు.. బాధపడలేదు. రఘురామ ఏదో అన్నారని కొట్టించారు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్ తెలుసుకోవాలి. జగన్ కారణంగా నేను, నా కుటుంబం ఎంతో బాధపడ్డాం. పవన్.. స్వశక్తితో పైకి వచ్చారు. ప్రాణాలు ఉన్నంతవరకు పవన్‌తోనే ఉంటా’’ అని అన్నారు.