చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు.. సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ

78பார்த்தது
చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు.. సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం అయన సీఎంకు లేఖ రాశారు. అజీజ్ నగర్‌లో తన బంధువుల పేరు మీద ఉన్న ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించాలని కోరారు. ‘ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో మా నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి. మా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చి వేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు.’ అని కేవీపీ స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி