తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై యంత్రాంగం మరింత దూకుడు పెంచుతోంది. హైడ్రా తరహా చర్యలకు సన్నద్ధం అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని FTL బఫర్ జోన్‌లలో గతంలో వెలసిన నిర్మాణాలపై సర్వే కొనసాగుతున్నది. ఈ క్రమంలో రామగుండం FCI గౌతమి నగర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.