సీఎం ఓఎస్డ్ మాణిక్, ఐఏఎస్ కన్నన్ కొడంగల్ లో పర్యటించారు. వికారాబాద్, నారాయణపేట కలెక్టర్లు ప్రతీక్ జైన్, సిక్తా పట్నాయక్ తో కలిసి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. అప్పాయి పల్లి శివారులో మెడికల్, వైద్య కళాశాలలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ ఉమా శంకర్, కడా అధికారి వెంకట్ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్ ఉన్నారు.