నిరుపేద విద్యార్థుల చదువులకు తను అండగా ఉంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన మహ్మద్ ఖాజా కుమారుడు మహ్మద్ ఒమర్ ఫరూక్ నీట్ ఎంట్రన్స్ లో స్టేట్ ర్యాంకు 1583 సాధించారు. పై చదువుల నిమిత్తం ఎమ్మెల్యేను వారు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూ. 29 వేల చెక్కును అక్కడికక్కడే అందజేశారు. తర్వాత కూడా తను అండగా ఉంటానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.