రామంతాపూర్: కాంగ్రెస్ను గెలిపించిన ఖర్మానికి పేద ప్రజల కంటికి కునుకు లేకుండా చేస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బుధవారం రామంతాపూర్ బాలకృష్ణానగర్ మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీనది పక్కన 30 ఏండ్లుగా నివాసముంటున్న పేద ప్రజల ఇండ్లు కూల గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు డీపీఆర్ సిద్ధం చేయలేదన్నారు.