సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైలు పట్టా ముక్కలు, ఇతర రైలు సామాగ్రిని దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల నుంచి రూ. 21, 000 విలువైన సామాగ్రిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం స్వాధీనం చేసుకుంది. రైల్వే సామాగ్రిని దొంగిలించిన వ్యక్తులపై రైల్వే చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.