అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు

54பார்த்தது
అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆదివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి ధర్నా చేయనున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ భారీగా మోహరించారు. ఎవరూ గుమిగూడకుండా చూస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల వల్ల పోలీసు బందోబస్తును పెంచింది.

தொடர்புடைய செய்தி