నగరంలో హిజ్రాల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. తాజాగా సికింద్రబాద్ లోని కుషాయిగూడ నాగార్జున నగర్ లో గురువారం ఓ ఘటన జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఓ దంపతులు టెక్స్టైల్ షాపు ఓపెన్ చేస్తుండగా 2 ఆటోల్లో వచ్చిన హిజ్రాలు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. రూ. 3 వేలు ఇవ్వబోతే శాపనార్థాలు పెట్టుకుంటూ భార్యాభర్తలపై దౌర్జన్యానికి తెగబడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.