సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన

78பார்த்தது
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు బుధవారం ఆందోళనకు దిగారు. వారంలో ఒకసారి మాత్రమే నడిచే జమ్ము తావి ఎక్స్ ప్రెస్ ను అధికారులు రద్దు చేయడంతో నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, అందుకే రైళ్ల సేవలు రద్దు చేసినట్లు సిబ్బంది సముదాయించారు. అయినా పలువురు ప్రయాణికులు 'వీ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி