2023-2024 సంవత్సరానికి గానూ సింగరేణికి వచ్చిన లాభాల్లో 33% రూ. 796 కోట్లను కార్మికులకు బోనస్ గా ఇస్తున్నామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కార్మికులకు సోమవారం బోనస్ చెక్కులను డిప్యూటి సీఎం పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ. 1, 90, 000 బోనస్ ను అందజేస్తున్నామని వెల్లడించారు.