మారేడ్ పల్లి: ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎమ్మెల్యే తలసాని
ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ ఆఫీసులో బేగంపేట, రాంగోపాల్ పేట డివిజన్ లోని 7 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి రూ. 2. 75 లక్షల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఏదైనా ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తితే అశ్రద్ధ చేయకుండా సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.