సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఉదయమిచ్చే బ్రేక్ ఫాస్ట్ నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా ఇస్తున్నారని రాత్రి మిగిలిపోయిన భోజనం ను మళ్లీ వేడి చేసి అల్పాహారంగా ఇచ్చారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించడంతో పోలీసు ఉన్నతాధికారులు వారితో చర్చలు జరిపారు. లేదంటే నిరసన కొనసాగిస్తామంటూ స్పష్టం చేశారు.