స్వతంత్ర సమరయోధుల మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని తెలంగాణ ఉద్యమకారులు గుర్తు చేశారు. ఓల్డ్ బోయిన్పల్లిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, ప్రభు గుప్తా తదితరులు హాజరయ్యారు.