అల్వాల్ డివిజన్ పరిధి శ్రీనివాసనగర్‌లో కొనసాగుతున్న రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వాటర్ లాగింగ్ పాయింట్లను గురువారం పరిశీలించారు. వర్షపునీరు, మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చూడాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు.