AP: వైసీపీ అధినేత జగన్కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కైకలూరు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్మీట్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే ఛాన్స్ ఉంది. గత కొద్ది రోజులుగా వైసీపీకి దూరంగా ఉంటున్న వెంకటరమణ.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, గతంలో వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.