ఆదిలాబాద్ సంజయ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి(22) ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుతున్నాడు. గురువారం రాత్రి అతని ఫోన్ వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్ పేరిట వీడియో కాల్ రాగా మాట్లాడాడు. అయితే ఆమె హఠాత్తుగా నగ్నంగా మారి వీడియోను రికార్డు చేసింది. ఆ తర్వాత విద్యార్థికి ఆ వీడియోను పంపి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో మూడు విడతలుగా రూ.20వేలు ఆన్‌లైన్‌లో పంపించాడు. మరిన్ని డబ్బులు పంపించాలని బెదిరించడంతో భయపడి పోలీసులను ఆశ్రయించాడు.