రానున్న దీపావళి పండుగ సందర్భంగా పెద్దలకు పూజలు చేస్తారు కాబట్టి స్మశాన వాటికకు వచ్చి పూజలు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్పొరేటర్ సామల హేమ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులకు దాదాపు 3 లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.