తెలంగాణ శాసనసభ బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుతో స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ యోధుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్ మంగళవారం శాసనసభలోని సీఎం ఛాంబర్ లో పుష్పగుచ్ఛం అందజేశారు.